నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 8వ తేదీ వరకూ జరగనున్నాయి.
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 8వ తేదీ వరకూ జరగనున్నాయి. ఉభయ సభలు నేడు సమావేశమయి కీలక అంశాలపై చర్చించనున్నాయి. నేడు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. రెండో విడత జరిగే సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు, సరైన సమాధానం చెప్పి నోరు మూయించాలని అధికార పార్టీ వ్యూహాలు రచించుకుని సిద్ధంగా ఉన్నాయి.
హాట్ హాట్ గా....
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో అధికార పార్టీ విపక్షాలపై విరుచుకుపడే అవకాశముంది. ప్రధానంగా ఉక్రెయిన్ వార్, భారతీయుల తరలింపు, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టనున్నాయి. కీలక బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.