షిండేకు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో షిండే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2023-05-11 07:07 GMT

సుప్రీంకోర్టులో షిండే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గోగ్వాలేను విప్ గా నియమించడాన్ని చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం మద్దతును ఏ విధంగా నిర్ణయించారన్న దానిపై పూర్తి స్థాయి విచారణ కోసం ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేస్తుందని తెలిపింది.

ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోయినా...
అయితే షిండే వర్గానికి కొంతలో కొంత ఊరట లభించింది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధలించలేమని, అలాగే గవర్నర్ తీసుకున్న నిర్ణయం సక్రమంగా లేదని అభిప్రాయపడింది. దీంతో మహారాష్ట్ర సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం వెలువరించాల్సిన తీర్పు ఫైనల్ కానుంది.


Tags:    

Similar News