విషాదం.. నదిలో స్నానం చేస్తూ ఆరుగురు బాలురు గల్లంతు
స్నానం చేస్తూ.. ఓ బాలుడు నీటిలో మునిగిపోగా.. అతడిని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు.. మొత్తం ఆరుగురు బాలురు..;
జైపూర్ : అందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పి.. హోలీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు వారంతా. హోలీ సంబరాలు అనంతరం నదిలో స్నానానికి దిగిన ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశాలోని జైపూర్ లో జరిగింది. శనివారం హోలీ సంబరాల అనంతరం ఆరుగురు బాలురు స్నానం చేసేందుకు జాజ్ పూర్ లోని ఖరస్రోత నదిలో దిగారు.
స్నానం చేస్తూ.. ఓ బాలుడు నీటిలో మునిగిపోగా.. అతడిని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు.. మొత్తం ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. నదిలో మునిగిపోతున్న బాలురని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని స్థానికులు పేర్కొన్నారు. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.