Heart Attack: ఆరేళ్ల చిన్నారికి గుండెపోటు.. రీజన్ ఇదే

ఆరేళ్ల విహాన్ జైన్ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది

Update: 2023-11-28 05:38 GMT

గతంలో వయసు పెరిగిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు వచ్చేవి. ఎక్కువగా స్మోకింగ్ చేసే వారిలోనూ, మరికొన్ని దురలవాట్లున్న వారికే గుండెపోటుతో మరణించేవారు. కానీ రాను రాను గుండెపోటుకు వయసుతో సంబంధం లేకుండా పోయింది. యువకుల నుంచి పెద్దోళ్ల వరకూ గుండెపోటుకు గురయి మరణించడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించడం కూడా విస్మయం కలిగించేదైనా ఇది వాస్తవమంటున్నారు వైద్యులు

చిన్నారికి ఆరోగ్యం బాగాలేక...
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉండే వ్యాపారవేత్త రాహుల్ జైన్ ఒక్కగానొక్క కుమారుడు విహాన్ జైన్ కు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతున్న విహాన్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించిన తర్వాత కొంత పరిస్థితి మెరుగుపడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలసి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు జైన్ కుటుంబం ఢిల్లీ వెళ్లింది. అక్కడ బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే మయోకార్డిటిస్ వైరస్ తోనే గుండె పోటుతో మరణించాడని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కుటుంబాన్ని ఓదార్చేదెవరు.


Tags:    

Similar News