భారత్ లో అదుపులోనే కరోనా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనపడుతుంది. కొద్ది రోజులుగా నాలుగు వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి

Update: 2022-09-30 06:12 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనపడుతుంది. కొద్ది రోజులుగా నాలుగు వేలకు దిగువన కేసులు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఒక్కరోజులో భారత్ లో 3,947 కరోనా వైరస్ బారినపడ్డారు. 3.20 లక్షల మందికి పరీక్షలు చేయగా ఈ ఫలితం వచ్చింది. ఒక్కరోజులో 9 మంది మాత్రమే మరణించారు. మరణాల సంఖ్య బాగా తగ్గడం శుభపరిణామమే. రికవరీ శాతం 98.73 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 09 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు.

4.45 కోట్ల మంది ....
దేశంలో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.45 కోట్ల మంది కరోనాకు చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 5,28,629 మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ లో 39,583 యాక్టివ్ కేసులున్నాయి. 218.52 కోట్ల మేరకు కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News