కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.. ఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
జిల్లాల స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. దూరదృష్టితో వ్యవహరించి.. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఒమిక్రాన్
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ కనీసం 3 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని రాజేశ్ భూషణ్ తెలిపారు. ఇప్పట్నుంచే జిల్లాల స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. దూరదృష్టితో వ్యవహరించి.. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు వార్ రూమ్లను యాక్టివేట్ చేయాలని సూచించారు. అవసరమైతే కంటైన్మెంట్ జోన్లుగా విభజించి తగు జాగ్రత్తలను పాటించాలన్నారు. అలాగే వ్యాక్సినేషన్ పూర్తిగా పూర్తి కాని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.