మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్

ఎన్నికల కమిషనర్ల నియామకం పై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది.

Update: 2023-03-02 06:10 GMT

ఎన్నికల కమిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది. చీఫ్ ఎన్నికల కమినర్ నియామకానికి సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. సుప్రీంకోర్టులో ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై విచారణ జరగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

ఎన్నికల కమిషనర్ల నియామకానికి...
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రత్యేక కమిటీని రూపొందించాలని ఆదేశించింది. ఈ కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిస్ లు ఉండాలని పేర్కొంది. కమిటీ రూపొందించిన పేర్లలో రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమిస్తారని పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నియామకపై గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మోదీ సర్కార్ కు కొంత ఇబ్బంది కలిగించేది అనే చెప్పాల్సి ఉంటుంది.


Tags:    

Similar News