Supreme Court : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం సంచలన తీర్పు

ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Update: 2024-08-01 05:44 GMT

ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రం దీనిని వ్యతిరేకించారు. మిగిలిన న్యాయమూర్తులు సమర్థించారు. ఉపవర్గీకరణ సాధ్యమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రబుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని పేర్కొంది.

న్యాయస్థానం సమర్థించడంతో...
2004 లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించడంతో విద్య, ఉద్యోగాల్లో ఉపవర్గీకరణ చేయవచ్చని తెలపడంతో మాదిగ కులాలకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేయడంతో ఈ తీర్పు మాదిగలకు సానుకూలంగా వచ్చింది.


Tags:    

Similar News