Rain Alert : తమిళనాడులో భారీ వర్షాలు.. ఏడు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అధికారులు ప్రకటించారు.;

Update: 2024-10-26 02:22 GMT
heavy rains,  seven districts, orange alert,  tamil nadu
  • whatsapp icon

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అధికారులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దానా తుపాను ప్రభావం కూడా తమిళనాడులో తీవ్రంగా కనిపించిందని చెప్పాలి. గత రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మధురైలో కుండపోత...
మధురైలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలునీట మునిగాయి. మదురైలో విద్యుత్ సరఫరాను అధిఇకారులు నిలిపివేశారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వారిని తరలించింది.సహాయక చర్యలను చేపట్టింది. 


Tags:    

Similar News