అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది;

Update: 2024-10-27 01:43 GMT

అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు తమతో పాటు విమానంలో ఇరుముడిని తీసుకెళ్లవచ్చని తెలిపింది. లగేజీ బ్యాగ్ లో కాకుండా విమానంలోకి ఇరుముడిని తీసుకు వెళ్లేందుకు అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పౌరవిమాన యాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ రావు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. చెకిన్ బ్యాగేజీలో కాకుండా ఇకపై అయ్యప్ప స్వాములు తమ వెంట విమానంలోకి తీసుకెళ్లవచ్చని తెలిపింది.

వచ్చే ఏడాది జనవరి 20 వరకూ...
ఇప్పటి వరకూ అనేక కారణాలు, భద్రత దృష్ట్యా ఇరుముడిని విమానంలోకి అనుమతించేవారు కారు. కానీ ఇప్పుడు ఆ నిబంధనను మార్చారు. ఇకపై దేశీయ విమానాల్లో ఇరుముడిని విమానాల్లో తీసుకునేందుకు అనుమతిస్తారు. తమ వెంట విమానంలోకి స్వాములు ఇరుముడిని తీసుకెళ్లవచ్చు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకూ ఈ మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలపడంతో అయ్యప్ప భక్తులు ఆనందం వ్య్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో విమానంలో అయ్యప్ప స్వాముల రాకపోకలు కేరళకు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.


Tags:    

Similar News