ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ పడిపోతుంది

Update: 2024-10-29 04:01 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ పడిపోతుంది ఈరోజు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 266 గా నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. బయటకు వచ్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే అనారోగ్యం పాలవుతారని తెలిపారు.

ఆరోగ్య సమస్యలు...
అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గడానికి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దీపావళికి టపాసుల పేల్చివేతపై ఆంక్షలు విధించింది. అయితే దీపావళి తర్వాత మరింతగా కాలుష్యం పెరిగే అవకాశముందని అంచనాలున్నాయి.

Tags:    

Similar News