సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ లు చేయించుకోవచ్చని తెలిపింది

Update: 2022-09-29 06:39 GMT

అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ లు చేయించుకోవచ్చని తెలిపింది. భర్త బలవంతం చేసినా అత్యాచరం కిందకు వస్తుందని పేర్కొంది. వైవాహిక అత్చాచారంగా దానిని పేర్కొనాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. పెళ్లి కాలేదన్న పేరుతో అబార్షన్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం అవివాహిత మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది.

ఎంటీపీ చట్ట ప్రకారం...
గర్భం దాల్చిన 24 వారాల వరకూ అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. మెడికల్ టర్మినేషన్ కేసులో తీర్పును ప్రకటించే సమయంలో అబార్షన్ చేయించుకునే హక్కు అందరికీ ఉందని తెలిపింది. అబార్షన్ కు వివాహిత, అవావిహత అంటూ ఏమీ ఉండదని తెలిపింది. చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక షరతు కాకూడదన్న భావనను ఈ చట్టం తొలగిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.


Tags:    

Similar News