Breaking : నీట్ పరీక్షపై సుప్రీం సంచలన తీర్పు
నీట్ యూజీ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసన తీర్పు వెలువరించింది.
నీట్ యూజీ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసన తీర్పు వెలువరించింది. నీట్ పరీక్ష లీకేజీ కేవలం బీహార్ కే పరిమితమయిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా జరగలేదని తెలిపింది. అందుకోసమే నీట్ కౌన్సెలింగ్ ను రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడింది. కౌన్సెలింగ్ యధాతధంగా జరిగేలా ఆదేశాలు ఇచ్చింది.
అక్కడకే పరిమితం...
నీట్ యూజీ పరీక్షపై సమగ్ర తీర్పును సుప్రీంకోర్టు తీర్పు చెప్పించి హజారీబాగ్, పాట్నాలకే ఇది పరిమితమయిందని తెలిపింది. నీట్ యూజీ పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీలో వ్యవస్థీకృత అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ రీటెస్ట్ డిమాండ్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.