Chennai : చెన్నై చిగురుటాకులా వణికిపోతుందిగా

భారీ వర్షాలతో చెన్నై నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెట్రో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు

Update: 2024-10-16 04:01 GMT

భారీ వర్షాలతో చెన్నై నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తుపాను ప్రభావంతో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చెన్నైలోని వేలచేరిలో వేలాది ఇళ్లు నీటమునిగాయి. చెన్నైలో భారీ వర్షాలతో 11 సబ్ వేలు మూసివేశారు. చెన్నైలో సాయంత్రం వరకు మెట్రో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. సహాయ చర్యల కోసం 16 వేల మంది వాలంటీర్లను సిద్ధంగా ఉంచారు. చెన్నైలో 980 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశఆరు. వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.

నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్...
చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. పునరావాస కేంద్రాలకు వేలాది మందిని తరలించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. చెన్నైలో ప్రాణ నష్టం ఏమీ జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు నీట మునగడంతో రేపు గడవడం ఎలా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రేపు వాయుగుండం తీరం దాటే అవకాశముండటంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.


Tags:    

Similar News