ఈడీ విచారణకు సినీ నటి తమన్నా
ప్రముఖ సినీ నటి తమన్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు
ప్రముఖ సినీ నటి తమన్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. హెచ్‌పీజడ్ టోకెన్ మొబైల్ యాప్ కు సంబంధించిన కేసులో ఆమె ఈడీ ఎదుటకు హాజరయ్యారని చెప్పారు. మనీలాండరింగ్ కేసులో తమన్నా ను ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. బిట్ కాయిన్ తో పాటు క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరిట హెచ్‌పీజడ్ టోకెన్ మొబైల్ యాప్ మోసం చేసినట్లు గతంలోనే కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ యాప్ కు సంబంధించిన వారిని ఈడీ వరసగా ప్రశ్నిస్తూ వస్తుంది.
హెచ్‌పీజడ్ టోకెన్ యాప్...
అందులో భాగంగానే తమన్నాను గురువారం ఈడీ అధికారులు ప్రశ్నించారు. గౌహతి లోని ఈడీ కార్యాలయంలో ఆమెను ప్రశ్నించి తమన్నా నుంచి స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు. ఈ యాప్స్ కోసం పెద్దయెత్తున ఈవెంట్స్ ను నిర్వహించడం, అందులో తమన్నా పాల్గొనడంతో వేలాది మంది ఈ యాప్ లో భారీగా డబ్బులు పెట్టారు. ఈ యాప్ కు సంస్థకు సంబంధించిన 455 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అధికారులు గతంలోనే అటాచ్ చేశారు. అందులో భాగంగానే తమన్నాను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.