Rain Alert : నీట మునిగిన చెన్నై... భారీ వర్షంతో బెంబేలు

తమిళనాడులో భారీ వర్షాలకు చెన్నైలో ఈరోజు ఒక్కసారిగా రోడ్లపైకి వరద నీరు చేరింది

Update: 2024-10-15 13:12 GMT

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో చెన్నైలో ఈరోజు ఒక్కసారిగా రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో అనేక చోట్ల విద్యుత్తు వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ సౌకర్యం పలు ప్రాంతాల్లో నిలిపేశారు. చెన్నై నగరం ఈ భారీ వర్షాలతో బాగా ఎఫెక్ట్ అయింది. ఎంతగా అంటే ఒక్క చెన్నై నగరంలోనే వందల సంఖ్యలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు.

బయకు రావద్దంటూ...
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎల్లుండి చెన్నై - పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అలెర్ట్ అయింది. వీలయినంత వరకూ ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలుంటాయని చెప్పింది. అందువల్ల ఈ మూడు రోజులు నాలుగు జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం ఈ వర్షాలకు బాగా ఎఫెక్ట్ అయింది. ఇక్కడే ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


Tags:    

Similar News