రైతులకు గుడ్ న్యూస్... ధరలు పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి గిఫ్ట్ ప్రకటించింది;
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇవీ ధరలు...
ముఖ్యంగా గోధుమలకు క్వింటాల్ కనీస మద్దతు ధర 2,425 రూపాయలకు పెంచారు. బార్లీ ఎంఎస్‌పీ క్వింటాల్ కు 1,980 రూపాయలకు పెంచారు.శనగలకు 5,650 రూపాయలు, కందులు 6,700 రూపాయలు, ఆవాలు 5,950 రూపాయలు, కుసుమలు 5,940 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కనీస మద్దతు ధర పెరిగి రైతుల ఇళ్లలో దీపావళి పండగను ఘనంగా చేసుకోనున్నారు.