విమానాలన్నీ రద్దు.. భారీ వర్షాల ఎఫెక్ట్

గత కొన్ని గంటలుగా చెన్నైలో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. వర్షాలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి;

Update: 2024-10-16 06:02 GMT
flights are canceled in chennai today, heavy rains in chennai, latest chennai  news today, weather update in chennai today

heavy rains in chennai

  • whatsapp icon

గత కొన్ని గంటలుగా చెన్నైలో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. వర్షాలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే విమానాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో కూడా నీరు చేరడంతో పాటు చెన్నై నగరం అంతా నీటిలో మునిగిపోయింది.


పునరావాస కేంద్రాల్లో....
చెన్నైలోని వేలచేరిలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. చెన్నైలో భారీ వర్షాలతో 11 సబ్ వేలు మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సాయంత్రం వరకు మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చేశారు. సహాయక చర్యల కోసం 16 వేల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. ఒక్క చెన్నైలోనే 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడకు తరలించారు.

Tags:    

Similar News