Indian Railways : ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-17 12:40 GMT

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే టికెట్ల అడ్వాన్స్‌ టికెట్‌ రిజర్వేషన్‌ వ్యవధిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ముందస్తు రిజర్వేషన్‌కు 120 రోజుల గడువు ఉండేది. దీన్ని 60 రోజులకు తగ్గిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన నవంబర్‌ ఒకటి నుంచి అమలులోకి రానుంది.

ఇప్పటి వరకూ...
అంతకు ముందు చేసుకున్న టికెట్ల బుకింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని రైల్వేశాఖ తెలిపింది. అక్టోబర్‌ 31 వరకు చేసిన అన్ని బుకింగ్స్‌ అలాగే ఉంటాయని చెప్పింది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వేశాఖ ప్రకటన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఐఆర్‌సీటీసీ షేర్లు పతనమయ్యాయి. 2.2శాతం తగ్గి రూ.867.60 వద్ద ట్రేడవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి.అయితే కొంత వరకూ ఇది ప్రయాణికులకు ప్రయోజనమేనని అంటున్నారు రైల్వే శాఖ అధికారులు. ముందస్తు రిజర్వేషన్ చేయించుకుని క్యాన్సిల్ చేసుకునే వారి సంఖ్య ఈ నిర్ణయంతో తగ్గిపోతుందని అభిప్రాయపడుతుంది. దీంతో పాటు అందరికీ బెర్త్‌లతో పాటు సీట్లు కూడా లభిస్తాయని పేర్కొంది.


Tags:    

Similar News