టపాసులపై నిషేధం ఎత్తివేయం
దీపావళి పండగకు ఢిల్లీలో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
దీపావళి పండగకు ఢిల్లీలో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రీన్ కాకర్స్ అయినా వారిని అనుమతించబోమని స్పష్టం చేసింది. దీపావళి పండగ సందర్భంగా టపాసుల అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీ వేసిన పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఆందోళనను వ్యక్తం చేసింది.
వాయు కాలుష్యం...
ఢిల్లీలో బాణసంచా నిషేధంపై ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని, వాటిని ఎత్తివేయలేమని చెప్పింది. దీపావళి పండగ తర్వాత ఎన్‌సీఆర్ సెక్టార్ లో గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందని అభిప్రాయపడింది. గ్రీన్ కాకర్స్ వాడకాన్ని కూడా పరిమితం చేయాలని సూచించింది. దీపావళితో పాటు గురునానక్ జయంతి, కొత్త సంవత్సర వేడుకలు, ఛత్ పూజలకు కూడా టపాసులపై ఢిల్లీలో నిషేధం కొనసాగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది.