ఆ విగ్రహాల విలువ 22 కోట్లా.. ఎలా చిక్కాయంటే?

తమిళనాడుకు చెందిన ఐడల్ వింగ్ సిఐడి రూ.22 కోట్ల విలువైన ఆరు పురాతన విగ్రహాలను

Update: 2024-07-09 03:44 GMT

తమిళనాడుకు చెందిన ఐడల్ వింగ్ సిఐడి రూ.22 కోట్ల విలువైన ఆరు పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకుంది,.ఇంటి నిర్మాణం కోసం భూమిని తవ్వుతుండగా విగ్రహాలు దొరికాయని.. వాటిని అమ్మేయాలని ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. తిరుచ్చికి చెందిన ప్రత్యేక ఐడల్ వింగ్ సిఐడి బృందం తంజావూరులోని పెరియార్ సమతువపురం బస్టాప్ వద్ద కారును అడ్డగించింది. వాహనాన్ని వెతకగా అధికారులకు హిందూ దేవతల ఆరు పురాతన లోహ విగ్రహాలు దొరికాయి. త్రిపురాంతకర్, వీణాతర దక్షిణామూర్తి, రిషబదేవర్.. మూడు అమ్మన్/దేవత విగ్రహాలను కనుగొన్నారు.

డ్రైవర్ రాజేష్ కన్నన్, అతని సహచరులు లక్ష్మణన్, తిరుమురుగన్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం మైలదుతురై జిల్లా, కొరుక్కై గ్రామంలోని తన ఇంట్లో తవ్వుతుండగా విగ్రహాలను కనుగొన్నట్లు లక్ష్మణన్ విచారణలో పేర్కొన్నాడు. లక్ష్మణన్ దీని గురించి ప్రభుత్వ అధికారులకు తెలియజేయలేదని, బదులుగా తన ఇంట్లో విగ్రహాలను దాచిపెట్టాడని ఐడల్ వింగ్ పోలీసులు తెలిపారు. లక్ష్మణన్ విగ్రహాల గురించి రాజేష్ కన్నన్‌కు చెప్పగా.. వారు అంతర్జాతీయ స్మగ్లర్లకు విక్రయించడానికి ప్రయత్నించారు.
ఇటీవల రాజేష్ కన్నన్ విగ్రహాలను విదేశాలకు తరలించేందుకు లక్ష్మణన్ ఇంటికి వెళ్లి, విగ్రహాలను కారులో ఎక్కించుకున్నారు. వాటిని విక్రయించడానికి తిరుచ్చి మీదుగా చెన్నైకి వెళ్లాలని ప్లాన్ చేశారు. తిరుచ్చిలోని ఐడల్ వింగ్ సీఐడీ కారును అడ్డగించి విగ్రహాల ఆధారాలపై ఆరా తీశారు. నిందితులు సరైన వివరాలు అందించడంలో విఫలమవడంతో విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News