వామ్మో.. బంగారం ధర ఇంతనా?

బంగారం ధరలు పెరుగుదలకు అనేక కారణాలు ఉంటాయి. పసిడి ప్రేమికులకు ఇది కష్టంగా అనిపించవచ్చు

Update: 2022-10-01 02:12 GMT

బంగారం ధరలు పెరుగుదలకు అనేక కారణాలు ఉంటాయి. పసిడి ప్రేమికులకు ఇది కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇష్టంగా కొనే బంగారం విషయంలో ధరలు పెద్దగా పట్టింపు కాకపోయినా ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలను ఎప్పటికప్పుడు మార్కెట్ నిపుణులు అందిస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. బంగారం అంటే ఇష్టం ఎక్కువగా ఉన్న భారత్ లో దానికి ఉన్న డిమాండ్ కూడా అధికమే. వివిధర మోడల్స్ లో ఎప్టటికప్పడు ఊరిస్తుండటం అతివలను జ్యుయలరీ షాపుల వైపునకు లాగుతుంది. కొత్త కొత్త డిజైన్లతో బంగారు ఆభరణాలు మెరిసి పోతుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భారతీయ మహిళలు ముందుకు వస్తారు. అందుకే అంత డిమాండ్ నెలకొంది.

వెండి కూడా...
రెండో రోజు కూడా భారత్ లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు, కిలో వెండిపై రూ.600లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,650 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,900 రూపాయల వరకూ పెరిగింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 62,000 రూపాయలు ఉంది.


Tags:    

Similar News