శుభవార్త.. స్థిరంగా బంగారం ధర

బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్తే అనే చెప్పాలి. గత రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది

Update: 2022-08-01 03:52 GMT

బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్తే అనే చెప్పాలి. గత రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. బంగారం పెట్టుబడిగా చూసే వారికి కొనుగోలు చేయాల్సిన సమయం ఇదేనని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం బంగారం ధరల్లో మార్పునకు కారణంగా చూపుతారు. ఇక శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల సందడి ఎక్కువగా ఉంటుండం కూడా బంగారం ధరలు పెరిగే అవకాశముందని సూచిస్తున్నారు.

వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,490 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,200 రూపాయలుగా ఉంది ఇక వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతుంది. వెండి హైదరాబాద్ మార్కెట్ లో కిలో 63,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News