గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం
ఈరోజు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం అంటేనే భారతీయులకు మహా ప్రీతి. అపురూపమైన వస్తువుగా చూసే భారతీయులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే దానికి అంత డిమాండ్ ఏర్పడుతుంది. మహిళలు సొంత ఇంటికన్నా బంగారంపైనే ఎక్కువ మక్కువ చూపుతారని అనేక సర్వేల్లో తేలింది. అందుకే వీధికో జ్యుయలరీ షాపు వెలిసింది. పండగ, పబ్బాలకు బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇక పెళ్లిళ్ల సీజన్ లో సరేసరి. తగినంత బంగారం లేనిదే పీటలెక్కని వధువు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే బంగారం దుకాణాలు నిత్యం బిజీ బిజీగా ఉంటాయి. పేద నుంచి ధనికుల వరకూ తమ స్థోమతను అనుసరించి బంగారాన్ని కొనుగోలు చేయడం అనాదిగా వస్తుంది. భారతీయ సంస్కృతి లో భాగమైంది.
ధరలు ఇలా....
అయితే తాజాగా ఈరోజు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,850 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,450 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 63,000 రూపాయలుగా ఉంది.