BJP : బీజేపీకి ఇదే పనా...? ప్రభుత్వాలను కూల్చడం.. అధికారంలోకి రావడమే లక్ష్యమా?

భారతీయ జనతా పార్టీకి చిన్న రాష‌్ట్రం .. పెద్ద రాష్ట్రం అనే తేడా లేదు. తాము అధికారంలో ఉండాలని కోరుకుంటుంది.

Update: 2024-08-18 07:08 GMT

భారతీయ జనతా పార్టీకి చిన్న రాష‌్ట్రం .. పెద్ద రాష్ట్రం అనే తేడా లేదు. తాము అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కాషాయ జెండా ఎగురాలని భావిస్తుంది. అందులో తప్పులేదు. కానీ పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయడమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కారణమయింది. ప్రజాక్షేత్రంలో గెలిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులుండవు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని తమకున్న అధికారంతో లాగేసుకోవాలని చూడటమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

పెద్ద రాష్ట్రాల నుంచి...
మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లోనే తమకు అధికారం దక్కలేదని అధికారంలో ఉన్న పార్టీని నిలువునా చీల్చివేసింది. చివరకు శివసేన పార్టీని కూడా రెండు ముక్కలు చేసింది. ఇక ఇతర రాజకీయ పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా ఏమాత్రం పట్టించుకునే తీరిక ఆ పార్టీ అగ్రనేతలకు ఉండదు. కేవలం అధికారమే లక్ష్యంగా పావులు కదపడమే వారికి ముందున్న లక్ష్యం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై గవర్నర్ ముడా కేసును అనుమతించడంతో అస్థిరత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంంది. ఒడిశాలో ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ గెలుచుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ గెలిచిన ప్రభుత్వాన్ని కూలదోయడమే పనిగా పెట్టుకోవడంపైనే ప్రజాస్వామ్య వాదులు అభ్యంతరం చెబుతున్నారు.
తాజాగా ఝార్ఖండ్‌ను...
తాజాగా ఝార్ఖండ్ వంటి చిన్న రాష్ట్రంపైన కూడా కమలం పార్టీ కన్నేసింది. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ను తమ పార్టీలోకి రప్పించుకునేందుకు సిద్ధమయింది. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 45 స్థానాల్లో ఇండియా కూటమి గత ఎన్నికల్లో గెలవగా, 30 స్థానాల్లో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. ఆరు స్థానాలు ఖళీగా ఉన్నాయి. ఇటీవల బొగ్గు స్కాం కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన స్థానంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. జైలు నుంచి విడుదలయ్యాక హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో చంపై సోరెన్ కు బీజేపీ నేతలు గాలం వేశారు. ఆయన తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News