గోల్డ్ కొనాలనుకుంటున్నారా?

బంగారం తమకు అలంకారంగానే కాకుండా అవసరమైనప్పుడు ఉపయోగపడే వస్తువుగా చూస్తున్నారు.

Update: 2022-10-08 03:32 GMT

బంగారం ధరల కోసం నిత్యం కొనుగోలుదారులు ఎదురు చూస్తుంటారు. ధరల్లో పెరుగుదల ఉందా? లేదా తగ్గిందా? అన్నది చూసి మరీ కొనుగోలు చేస్తుంటారు. బంగారం పెట్టుబడిగా చూసే వారు ఎక్కువ మంది అయ్యారు. బంగారం తమకు అలంకారంగానే కాకుండా అవసరమైనప్పుడు ఉపయోగపడే వస్తువుగా చూస్తున్నారు. అవసరమైనప్పుడు, కష్టకాలంలో ఎక్కువ ఉపయోగపడేది బంగారమే. ఒకరి వద్ద చేయి చాచకుండా ఉండాలంటే డబ్బులు ఉన్నప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మేలన్న అభిప్రాయానికి వచ్చారు. కరోనా సమయంలో ఇది స్పష్టమయింది. బంగారం అనేక మందికి అన్ని రకాలుగా ఉపయోగపడింది. ఉపాధి అవకాశాలు కోల్పోయినా బంగారం ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి అప్పు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే బంగారానికి రాను రాను భారత్ లో డిమాండ్ పెరుగుతుంది.

వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,850 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి ధర హైదరాబాద్ లో 66,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News