బూస్టర్ డోస్ తీసుకున్నా ఒమిక్రాన్ వదల్లేదు

బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ సోకుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Update: 2021-12-18 04:24 GMT

బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ సోకుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన యువకుడు అమెరికా నుంచి ఈ నెల 9న ముంబయికి వచ్చారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. అయితే అతను అప్పటికే మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తేలింది.

కాంటాక్టయిన వారికి....
ఆ యువకుడు మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారని, అయినా ఒమిక్రాన్ వదిలి పెట్టలేదని వైద్యులు చెప్పారు. అతనితో కాంటాక్టయిన వారికి మాత్రం నెగిటివ్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.


Tags:    

Similar News