గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పదిగ్రాముల బంగారంపై రూ. 350లు తగ్గింది.

Update: 2022-12-17 04:13 GMT

gold rates today

బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ముఖ్యంగా భారతీయ మహిళలు అత్యంత ఇష్పపడే వస్తువు బంగారమే. పండగకు, పబ్బానికి బంగారం కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అందుకే బంగారానికి అంత డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ కు తగినట్లుగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కూడా వ్యాపారులకు కష్టంగా మారిందనే చెప్పాలి. అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం అందుకే కొందరికి ఇష్టంగానూ, మరికొందరికి కష్టంగానూ మారింది. పేదలు, సామాన్యులకు బంగారం అందకుండా పోతుంది.

వెండి కూడా...
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పదిగ్రాముల బంగారంపై రూ. 350లు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి పై రూ.1300లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,220 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,700 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 72,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News