భారీగా తగ్గిన బంగారం ధర
ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల బంగారం పై రూ900ల వరకూ తగ్గింది.
బంగారం అంటే ఎవరికి ప్రియం కాదు. అందరికీ ఇష్టమే. ప్రతి మహిళ తన వద్ద బంగారం ఎక్కువగా ఉండాలని ఆశపడతారు. తన వారసులకు అది కానుకగా ఇవ్వాలనుకుంటారు. ఇక ఇటీవల కాలంలో పెట్టుబడిగా కూడా మారింది. బంగారానికి విలువ తగ్గదని భావించిన వారు ఎక్కువ మొత్తంలోనే పెట్టుబడి రూపంలో కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా బిస్కెట్ల రూపంలో కూడా కొనుగోలు చేస్తుండటం ఇటీవల కాలంలో రివాజుగా మారింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
స్థిరంగా వెండి....
గత మూడు రోజుల నుంచి వరసగా బంగరం ధరలు వరసగా తగ్గుతున్నాయి. ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల బంగారం పై రూ900ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగార ంధర 50,620 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,400 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 58,000 రూపాయలుగా ఉంది.