పసిడి ధరలకు బ్రేక్

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-01-31 03:12 GMT

gold rates today

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎందుకు తగ్గుతాయో చెప్పలేం. తగ్గినప్పుడు సంబరపడిపోవడానికి వీలులేదు. స్వల్పంగానే ధరలు తగ్గుతాయి. పెరిగినప్పుడు మాత్రం ఆందోళన తప్పదు. ఎందుకంటే భారీగానే పెరుగుతాయి. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. లక్షలాది మంది నిత్యం బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. వివిధ అవసరాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. అయితే కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అయినా బంగారానికి ఎంతమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ఈ ఏడాది తులం బంగారం ఎనభై వేలకు చేరుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరసగా రెండో రోజు ధరలు నిలకడటా కొనసాగుతుండటం మంచి వార్తే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,440 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 74,700 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News