గోల్డ్ రేట్ ఈరోజు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం అపురూపంగా మారనుంది. ఇక అది అందరి వస్తువుగా కాకుండా కొందరి వస్తువుగానే మారనుంది. త్వరలోనే 60 వేల మార్క్ కు చేరుకునే అవకాశముంది. బంగారం, వెండి అంటేనే భారతీయులు ఇష్టపడతారు. తమ ఇంట్లో అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత శుభమన్న సెంటిమెంట్ వాటిని కొనుగోలుకు పురమాయిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా విక్రయించే దేశాల్లో భారత్ ఒకటి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అందుబాటులో లేకుండా పోతున్నాయి. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. శుభకార్యాలకు బంగారం, వెండిని వినియోగిస్తుండటం వల్లనే వాటి గిరాకీ తగ్గడం లేదు.
వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,600 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,200 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,300 రూపాయలకు పలుకుతుంది.