బంగారం ధరలు నేడు ఇలా

ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేదు

Update: 2022-07-12 02:29 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో చెప్పలేం. కాని గత మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ప్రేమికులకు కొనుగోళ్లకు ఇది మంచి సమయంగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. రానున్న కాలంలో బంగారం ధర పెరుగుతుందని, కొనుగోలు చేయదలచుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వంటివి బంగారం ధరల్లో మార్పులకు కారణంగా చెప్పుకోవచ్చు.

వెండి కూడా...
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,210 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,950 రూపాయలుగా ఉంది. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 63,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News