వావ్.. బంగారం దిగి వచ్చిందే

ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ప్రియులకు శుభవార్తగానే చెప్పుకోవాలి. పది గ్రాముల బంగారం పై రూ.200లు తగ్గింది

Update: 2023-01-19 02:50 GMT

బంగారం ధర పెరిగిందంటే వార్త కాదు. తగ్గిందంటే వార్త అవుతుంది. అవును గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.కేేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం దిగుమతి కూడా భారత్ లో తగ్గడం ధరలు పెరగడానికి కారణంగా చెబుతుంటారు. బంగారం దిగుమతి తగ్గిస్తే రూపాయి విలువ బలపడుతుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించింది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయన్నది మార్కెట్ నిపుణుల విశ్లేషణ. ప్రపంచంలోనే భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. అయితే గత కొంతకాలంగా దిగుమతులను తగ్గించిందని చెబుతున్నారు.

స్వల్పంగా తగ్గిన వెండి...
తాజాగా ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ప్రియులకు ఇది ఒక రకంగా శుభవార్తగానే చెప్పుకోవాలి. పది గ్రాముల బంగారం పై రూ.200లు తగ్గింది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరుగుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి. వెండి కూడా కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,000 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,730 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 74,800 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News