ఆరు రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు

ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ220లు తగ్గింది. వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి

Update: 2023-02-24 06:17 GMT

బంగారం ధరలు ఎప్పుడూ తగ్గవు. గత ఆరు రోజులుగా తగ్గుతున్నాయంటే ఇది ఖచ్చితంగా కొనుగోలుదారులకు శుభవార్తగానే చెప్పాలి. నిజానికి బంగారం ధరలు పెరుగుతాయనుకుని భయపడుతున్న సమయంలో వరసగా ధరలు దిగి రావడం గోల్డ్ లవర్స్ కు అత్యంత ఇష్టమైన వార్తే అవుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగిపోతాయని భావించారు. మార్కెట్ నిపుణులు కూడా అదే అంచనా వేశారు. అయితే గత ఆరు రోజులుగా పసిడి ధరలు తగ్గుతున్నాయి. స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ ధరలు దిగిరావడం పట్ల కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్థిరంగా వెండి ధర...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ220లు తగ్గింది. వెండి ధరలు మాత్రం ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,510 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,500 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News