భారంగా మారిన బంగారం

తాజాగా బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కూడా పెరిగింది

Update: 2022-12-06 03:10 GMT

ప్రతి భారతీయ మహిళ ఎంతో కొంత బంగారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తుంది. తాను కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో బంగారు ఆభరణాన్ని కొనుక్కోవాలని కలలు కంటుంది. బంగారం భారంగా మారిన సమయంలోనూ మహిళల కోరికలలో మార్పు మాత్రం రావడం లేదు. దీనికి పెరుగుతున్న కొనుగోళ్లు నిదర్శనం. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

భారీగా పెరిగిన వెండి...
తాజాగా బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కూడా పెరిగింది. కొనుగోళ్లు పెరగడంతో డిమాండ్ కూడా అధికం కావడంతో బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. జ్యుయలరీ షాపులన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,110 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,600 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 72,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News