పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి కూడా అదే బాటలో కొనసాగుతుంది

Update: 2022-12-05 03:23 GMT

బంగారం అంటేనే మోజు. ముఖ్యంగా మహిళలకు మక్కువయిన పసిడికి భారత్ లో డిమాండ్ అధికం. ఆభరణాలుగా అలంకరించుకుని తమ అందాలకు మరింత మెరుగులు దిద్దుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. మేలిమి బంగారు ఆభరణాల కోసం కష్టపడి దాచుకున్న సొమ్ములను వెచ్చిస్తుంది. అదో వీక్ నెస్. కానీ బంగారం ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు.

వెండి కూడా...
గత ఐదు రోజులుగా వరసగా బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మాత్రం బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరలు పెరగలేదు. తగ్గలేదు. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. ఐదు రోజుల్లోనే పది గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,950 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,450 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 71,600 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News