వావ్.. బంగారం దిగి వచ్చిందే

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.550లు తగ్గింది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది

Update: 2023-02-11 02:42 GMT

పసిడి అంటేనే మగువలకు మహా ప్రీతి. బంగారాన్ని కొనుగోలు చేయడానికి మహిళలు తహతహలాడుతుంటారు. కానీ అనేక కారణాల రీత్యా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. డిమాండ్ ప్రకారం బంగారం ధరలు పెరగవట. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వల్ల బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. భారత్ లో ఎక్కువగా ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తారు. గోల్డ్ బాండ్స్ అనేవి ఇక్కడ తక్కువగా అమ్ముడుపోతాయి. అందుకే బంగారానికి అంత డిమాండ్.

ధరలు ఇలా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.550లు తగ్గింది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,400 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,160 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండ ధర 72,500 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News