గోల్డ్‌లవర్స్.. ధరలు లుక్కేయండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై 760 రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అక్షర తృతీయ సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరగడంతో సామాన్యుల నుంచి మధ్య తరగతి ప్రజల వరకూ బంగారం కొనుగోలు చేయలేక ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరికి తులం బంగారం డెబ్భయివేలకు చేరుకుంటుందని కూడా చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుతుండటంతో కొత్త కాకపోయినా కొనుగోళ్లు మాత్రం కొంత మందగించాయనే చెప్పాలి. అంత ధరలు పెట్టి కొనుగోలు చేసే శక్తి లేక అనేక మంది బంగారానికి దూరంగా ఉంటున్నారు.
భారీగా వెండి...
అయితే తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై 760 రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధరపై 1100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,800 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 81,500 రూపాయలుగా ఉంది.