చాలా రోజులకు గుడ్ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-04-17 02:36 GMT

పసిడి ఉంటే గౌరవం. మర్యాద. మెడలో బంగారు ఆభరణాలు ఎన్ని ఉంటే సమాజం అంత గౌరవిస్తుందన్న నమ్మకం. అందుకే ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ ఎక్కువ. మహిళలు ఎక్కువగా పసిడి అంటే ముచ్చట పడి పోతారు. తాము దాచుకున్న కొద్ది డబ్బుతోనైనా తొలుత బంగారాన్ని కొనుగోలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇతర దేశాల్లో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసే అలవాటుంది. కానీ భారత్ లో ప్రధానంగా దక్షిణ భారత దేశంలో మాత్రం బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతారు. ఇక పెళ్లిళ్లు వంటి వేడుకలకు సరే సరి. బంగారం ఎంత ఖరీదైనా అప్పు చేసి మరీ కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నా వాటి కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. వ్యాపారులు కూడా కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

స్థిరంగా వెండి ధరలు
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది పసిడిప్రియులకు ఊరట కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,940 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,030 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర మాత్రం 81,500 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News