గోల్డ్ లవర్స్‌ చెవులకు ఇంపైన వార్త

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2023-04-21 04:26 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థిితి. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు దారులు కూడా ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ వెయిట్ చేస్తుంటారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణంగా బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ మేరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్య తరగతి ప్రజలకు బంగారం భారంగా మారిపోయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయలేెక సతమతమవుతున్నారు.

వెండి మాత్రం...
ఈ పరిస్థితుల్లో తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,850 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,930 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతూ 81,000 రూపాయల వద్ద నిలకడగా ఉంది.


Tags:    

Similar News