పసిడి ప్రియులకు ప్రియమైన వార్త

ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.160 ల వరకూ తగ్గింది.

Update: 2022-11-01 02:31 GMT

బంగారం ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశముంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు నెలలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అందుకే బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనా వినిపిస్తుంది. భారత్ లో వివాహ వేడుకల్లో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అధిక మొత్తంలోనే బంగారాన్ని కొనుగోలు చేసే అలవాటు భారతీయులకు ఎక్కువ. అయితే బంగారం ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటం ఇటీవల కాలంలో చూస్తున్నామని దుకాణదారులు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి స్థిరంగా....
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.160 ల వరకూ తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,840 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,600 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 63,000 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News