వావ్.. ఈరోజు కూడా గుడ్‌న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.70లు తగ్గింది. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

Update: 2023-02-15 03:21 GMT

బంగారం ధర తగ్గుతుందంటే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు. అయితే మనిషి ఆశాజీవి. ఎంత తగ్గినా సంబరపడిపోతాడు. తగ్గినప్పుడు తక్కువగా, పెరిగినప్పుడు భారీగా ధరలు పెరగడం బంగారం విషయంలోనే చూస్తుంటాం. పది సార్లు బంగారం ధరలు తగ్గితే ఒక్కసారి పెరిగితే చాలు దానితో సమానం అవుతుంది. అయితే కొనుగోలు దారులు ఇవేమీ పట్టించుకోరు. బంగారం ధరలు తగ్గాయా? లేదా? అన్నది మాత్రమే చూస్తారు. మైండ్ సెట్ అలా ఉండటంతో బంగారం ధరలకు కూడా అలాగే అలవాటు పడిపోయారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినా సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరిగిపోతుండటంతో వ్యాపారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్త కొత్త డిజైన్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.

భారీగా పెరిగిన వెండి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.70లు తగ్గింది. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి పై రూ.400లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,240 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 72,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News