మగువలకు గుడ్ న్యూస్...ధరలు తగ్గాయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.160లు తగ్గింది. వెండి కూడా స్వల్పంగా తగ్గింది

Update: 2023-01-03 03:09 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. ఎంత పెరుగుతాయో ఊహించలేం. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాలనుకుంటాం. బంగారం భారతీయ సంస్కృతిలో భాగమయినందున దానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తారు. బంగారానికి డిమాండ్ పెరిగిన నాటి నుంచి ధరలు కూడా అదుపులో ఉంచలేకపోతున్నాం. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ వారంలో ఐదు రోజులు బంగారం ధరలు పెరిగితే, ఒక్కరోజు స్థిరంగానూ, ఒక రోజు స్వల్పంగా తగ్గడం జరుగుతుండటం మనం చూస్తుంటాం. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే ఆరు నెలల్లో బంగారం అరవై వేలకు చేరుకుంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి.

వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.160లు తగ్గింది. వెండి కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,450 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,040 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 74,500 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News