బంగారం దిగివచ్చింది... కొనేసేయ్యండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.280లు తగ్గింది
బంగారం ధరల్లో మార్పులు సహజమే. అయితే ఎక్కువగా బంగారం ధరలు పెరుగుతుండటమే చూస్తాం. తగ్గినా స్వల్పంగా ధర తగ్గతుంది. లేకుంటే స్థిరంగా కొనసాగుతుంది. భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ను అసుసరించి ధరల నిర్ణయించరు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధరలను గురించి పెద్దగా పట్టించుకోకుండేనే కొనుగోలు చేస్తుంటారు. కేవలం ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడి రూపంలో బంగారాన్ని చూస్తుండటంతో దానికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. భూమి తర్వాత అత్యంత విలువైన పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తారు. ధర రెట్టింపు అయిన సందర్భాలు కూడా లేకపోలేదు. అందుకే భారతీయ మార్కెట్ లో బంగారానికి అంత డిమాండ్ ఉంది.
వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.280లు తగ్గింది. రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర 52,250 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,900 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 63,300 రూపాయల వద్ద కొనసాగుతుంది.