తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి
ఈరోజు బంగారం ధరల దేశంలో స్వల్పంగా తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది
బంగారం అంటేనే అందరికీ ప్రియం. ప్రతి ఒక్కరికీ అది గౌరవం తెచ్చిపెట్టే వస్తువు. ఆభరణాాలు మేనికి ఎంతో అందాన్ని చేకూరుస్తాయి. అందుకే మగువలు బంగారం అంటే అత్యంత ఇష్టపడతారు. వారికి మరే వస్తువు మీద ఉన్నంత మమకారం బంగారం మీద ఉంటుంది. చిన్న చిన్నగా పొదుపు చేసి మరీ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది జ్యుయలరీ షాపులకు పరుగులు తీస్తున్నారు. గతంలో మాదిరి కాదు. ఇప్పుడు కావాల్సిన డిజైన్లు. తాము అనుకున్నవి... చూసిన డిజైన్లను కూడా కంపెనీలు తయారు చేసి అందించే పనిలో ఉన్నాయి. అందుకే బంగారానికి ఎప్పుడూ భారత్ లో డిమాండ్ తగ్గదు. ఇక డాలర్ తో రూపాయి విలువ తగ్గడం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి.
హైదరాబాద్ మార్కెట్ లో....
తాజాగా ఈరోజు బంగారం ధరల దేశంలో స్వల్పంగా తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,020 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,850 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం హైదరాబాద్ లో 62,000 రూపాయలుగా ఉంది.