గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్

దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.150లు తగ్గింది. వెండి రేట్లు కూడా భారీగానే తగ్గాయి

Update: 2023-02-14 03:53 GMT

బంగారం ధరలు పెరిగితే ఆందోళన. అదే తగ్గితే ఆనందమే. కొనుగోలుదారులు బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అంటూ వేచి చూస్తారు. ప్రతి రోజూ బంగారం ధరలు పెరగడం పరిపాటిగా మారింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం కంట్రోలు చేయడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.

తగ్గిన వెండి...
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.150లు తగ్గింది. వెండి రేట్లు కూడా భారీగానే తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు నేడు తగ్గడం విశేషం. పసిడిప్రియులకు ఇది ఊరట కలిగించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,380 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 72,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News