భారీగానే తగ్గాయ్

దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.500లు తగ్గింది

Update: 2023-02-04 03:13 GMT

బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధరలు ఇప్పటికే చేరిపోయాయి. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయకుంటే కొనుగోళ్లు కూడా తగ్గిపోయే అవకాశముంది. భారత్ లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారు ఎక్కువ. గోల్డ్ బాండ్స్ కు పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకే బంగారానికి భారత్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. భారతీయ సంస్కృతిలో ఒక భాగమై పోయిన బంగారానికి డింాండ్ పడిపోదన్న కారణంతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకూ సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేస్తుండటంతో దాని డిమాండ్ తగ్గలేదు. ఇక అవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి. కేవలం పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారు మినహా బంగారం వైపు ఎవరూ చూడరన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.500లు తగ్గింది. వెండి ధరలు కూడా గణనీయంగానే తగ్గాయి. వెండి కిలోపై రూ.900లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,100 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,930 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 76,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News