బంగారం ధర.. షాకింగ్

దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.330లు పెరిగింది

Update: 2023-01-10 03:50 GMT

బంగారం అంటే అంతే మరి. ఒకరోజు స్వల్పంగా తగ్గితే.. మరో రోజు స్థిరంగా కొనసాగుతుంది. ఇక మిగిలిన ఐదు రోజులు బంగారం ధరలు భారీగా పెరగడమే. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. బంగారం అంటే భారతీయులకు మహా ప్రీతి. ఎంత ఖర్కైనా బంగారం కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో ఉంటారు. తమకున్న కొద్దిపాటి డబ్బుతో బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. డబ్బులను కూడబెట్టి మరీ బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువయింది. జ్యుయలరీ షాపులు కూడా ఈఎంఐల ఫెసిలిటీ కల్పించడంతో కొనుగోలు దారుల సంఖ్య మరింత పెరిగిపోతుంది. దీంతో బంగారానికి సీజన్ తో నిమిత్తం లేకుండా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే ధరలు పెరుగుతున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.330లు పెరిగింది. దీంతో 24 వేల క్యారెట్ల పది గ్రాముల బంగారం యాభై ఆరు వేల రూపాయలను దాటేసింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. కిలో వెండి పై రూ.500లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,290 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News