గోల్డ్ రేట్స్.. ఓ లుక్కేయండి

ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది.

Update: 2022-10-24 02:15 GMT

బంగారం అంటేనే భారతీయులకు మహా ప్రియం. ముఖ్యంగా మహిళలకు అత్యంత ఇష్టమైన వస్తువు. ఒకప్పుడు అత్యంత ఖరీదైనదిగా భావించే బంగారాన్ని ఇప్పుడు సాధారణ వస్తువుగానే అనేక మంది చూస్తున్నారు. పేద నుంచి ధనికుల వరకూ తమ ఉన్న దాంట్లో బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. పెట్టుబడిగా చూస్తుండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది. పండగల నుంచి పెళ్లిళ్ల వరకూ ఇది అవసరంగా మారిపోయింది. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఒకప్పుడు ఆచితూచి కొనుగోలు చేసేవారు. ముందు ఆర్డర్ ఇస్తే కాని తర్వాత తాము అనుకున్న వస్తువు తమ చేతికి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. కంటి ముందు కళ్లు చెదిరిపోయే డిజైన్లు కంటి ముందుకు వచ్చేశాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

నిలకడగా వెండి...
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,290 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,010 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం 63,200 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News