అమ్మో.. ధరలు ఇంత పెరిగాయా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.500లు పెరిగింది.

Update: 2022-12-15 04:02 GMT

బంగారం అంటే అంతే మరి. తగ్గిందని సంతోషపడేలోగా ధర పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది. ఇది మామూలే. అందుకే బంగారం అందరి వస్తువు కాలేకపోతుంది. కొందరి వస్తువుగానే మారుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు జరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరగడం సహజమేనంటున్నారు. అయితే ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు నిపుణులు.

భారీగా పెరిగిన ధరలు..
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.500లు పెరిగింది. కిలో వెండి ధరపై రూ.2000ల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,880 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,300 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 74,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News